సుప్రీంకు 627 మంది నల్లకుబేరుల జాబితా

నల్లకుబేరుల జాబితాను కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించింది. నల్లకుబేరుల జాబితాను సమర్పించేందుకు ఈ రోజుతో గడువు ముగియనుండంతో కేంద్రం 627 మందితో కూడిన నల్లకుబేరుల జాబితాను సుప్రీం కోర్టుకు సమర్పించింది. సీల్డ్ కవర్ లో కేంద్రం మూడు జాబితాలను సమర్పించింది. ఒక జాబితాలో నల్లధనం వున్న వారి వివరాలు, రెండో జాబితాలో విదేశి ఖాతాదారులుగా వున్న వారి వివరాలు, మూడో జాబితాలో దర్యాప్తు పురోగతిని వివరించింది. సిట్ దర్యాప్తుకు సుప్రీం మార్చి 2015 వరకు గడువు ఇచ్చింది.