పోషకాల గని.. గోధుమ

 

చవకగా లభించే పుష్టికరమైన ఆహారం గోధుమ. బంగారు రంగులో ముత్యాల్లా మెరిసిపోయే గోధుమ నుంచి ఎన్నో పోషకాలు లభిస్తాయి. అయితే వీటిలో మాంసకృత్తుల శాతం తక్కువ. కాబట్టి ఆ లోటుని పూరించడానికి గోధుమలని మరికొన్ని ఆహార పదార్ధాలతో కలపి తీసుకోవాలి. మినుములు, పెసలు, కందులు, బఠానీ, సోయా, లెంటిల్స్ వంటి పప్పు దినుసులతో కలిపి వండితే గోధుమలోని పోషక పదార్ధాలతోపాటు తగినన్ని మాంసకృత్తులు కూడా అందుతాయి శరీరానికి. అలాగే పాలకూర, గోంగూర, చుక్కకూర, మునగాకు వంటి ఆకు కూరలతో కలిపి కూడా వండచ్చు. ఉదాహరణకి చపాతీ పిండిలో గుప్పెడు శనగపిండి కలపటం, చపాతీలతోపాటు పప్పు దినుసులతో చేసిన కూర లేదా ఆకు కూరతో చేసే పరాఠా... వంటివి చేస్తే గోధుమల నుంచి పూర్తి పోషకాలని పొందచ్చు.

 

-రమ