ఆసుపత్రిలో మంత్రివర్గ సమావేశం

 

ముఖ్య మంత్రి పరిపాలన సచివాలయం నుచి లేదా అధికారిక నివాసం నుంచి కొనసాగిస్తారు.మంత్రివర్గ సమావేశాలు కూడా సచివాలయంలోనే జరుగుతాయి.కానీ ఓ ముఖ్య మంత్రి పరిపాలనతో పాటు మంత్రివర్గ సమావేశాన్ని కూడా ఆసుపత్రిలోనే జరుపుతున్నారు.

గత కొంతకాలంగా పాన్‌క్రియాటిక్ సమస్యతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.అంతకుముందు కూడా పారికర్‌ పలుసార్లు అమెరికా, ముంబయిలలోని ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. అనారోగ్య సమస్య కారణంగా ఆయన తరచూ విధులకు దూరమవడంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ విమర్శలకు దిగింది. గోవాలో భాజపా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. అసెంబ్లీలో తమకు సంఖ్యాబలం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర గవర్నర్‌ కూడా కోరిన విషయం తెలిసిందే.ఈ విమర్శల నడుమ పారికర్‌ ఆసుపత్రి నుంచే సీఎం బాధ్యతలను కొనసాగిస్తున్నారు.తాజాగా ఆసుపత్రిలోనే మంత్రివర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భాజపా వర్గాలు వెల్లడించాయి.రాష్ట్ర పాలనా వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై మంత్రులు, కూటమి నేతలతో పారికర్‌ ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే శాఖల మార్పులపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నట్లు సమాచారం