3వ దశ ఎన్నికలు షురూ

 

ఈరోజు 11 రాష్ర్టాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో మూడో విడత సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ మొదలయింది. మొత్తం 92 నియోజకవర్గాల్లో 11 కోట్ల మందికి పైగా ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.

 

మధ్యప్రదేశ్‌లో-9, ఛత్తీస్‌గఢ్‌-1, మహారాష్ట్ర-10, హర్యానా-10, లక్షద్వీప్‌-1, కేరళ- 20, అండమాన్ నికోబార్ దీవులు-1, జమ్ముకాశ్మీర్‌-1, ఢిల్లీ-7, ఉత్తరప్రదేశ్‌-10, బీహార్‌-6, జార్ఖండ్‌-5, ఒడిశా-10 నియోజక వర్గాలలో పోటీ చేస్తున్న మొత్తం 1419 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ రోజు తేలనుంది.

 

మళ్ళీ ఈనెల 12న జరిగే నాలుగవ దశ ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో 5 నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 17,24, మరియు 30తేదీలలో జరిగే 5,6,7 దశ ఎన్నికలలో 13 రాష్ట్రాలలో మొత్తం 338 నియోజక వర్గాలలో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణాలో, మే7న ఆంధ్రలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు మే16న వెలువడుతాయి.