తూచ్! మేము సిలిండర్లు ఇస్తామని అనలేదు.

 

పుట్టుకతో వచ్చినబుద్ది పిడకలతోగాని పోదంటారు పెద్దలు. ఎలెక్షన్ కమీషన్ ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా పుట్టుకతోవచ్చిన అలవాట్లను అంత తొందరగా వదులుకోలేక పోతోంది కాంగ్రెస్ పార్టీ. మొన్నటి నగదు బదిలీ పధకం, నిన్నటి సబ్సీడీ గ్యాస్ సిలండర్ల పెంపు ప్రకటనలు ఆ కోవలోకే వస్తాయి. దేశాన్ని ప్రగతిపదంలో నడిపించగలిగిననాడు, ఏ పార్టీకూడా ఇటువంటి చీప్ ట్రిక్స్ చేయనవసరంలేదు. తన పరిపాలన మీద తనకే నమ్మకం లేనప్పుడు మాత్రమె ఇటువంటివి అవసరమవుతాయి. మోడీ తన రాష్ట్రాన్ని అబివృద్దిపదంలో తీసుకు వెళుతుండబట్టే, ఆత్మ విశ్వాసంతో ముందుకుసాగుతూ ఒంటరి పోరుచేస్తున్నాడు. గానీ, 125 సం. చరిత్ర ఉన్నకాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రంవచ్చిననాటి నుండి దేశాన్ని పరిపాలిస్తునే ఉన్నపటికీ, అది దేశాన్ని ఉద్దరించింది ఏమి లేదు. సాధించిన ప్రగతి లేదు. అందుకే, ప్రజలను ఎప్పటికప్పుడు సరికొత్త నినాదాలతో, తాయిలాలతో మభ్యపెట్టి వోట్లు వేయించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయిన, కేవలం ఇటువంటి వాటికి ప్రజలు, అందునా వ్యాపార వేత్తలుగారాణించే గుజరాతీలు పడిపోతారని అనుకోవడం కాంగ్రెస్ తెలివితక్కువతనానికికి అద్దం పడుతోంది. మళ్ళీ ఎలక్షన్ కమీషన్ చేత మొట్టికాయలు వేయించుకొన్న తరువాత కాంగ్రెస్ ప్రతినిది వయలార్ రవి ‘తూచ్! మేము సిలండర్లు ఇప్పుడే ఇచ్చేస్తామని చెప్పలేదు. కేవలం ఆ విషయం పరిశీలిస్తునామనే చెప్పాము. అది కేవలం ప్రతిపాదన మాత్రమె! అని గడుసుగా జవాబిచ్చి ఎలక్షన్ కమీషన్ ఆగ్రహానికి మరో మారు గురయ్యారు.