జగన్ పార్టీకి ‘గండి’ పడింది

 

జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీలోంచి అనేక చేపలు తప్పించుకుని పోతున్నాయి. జగన్ నిరంకుశ, నియంతృత్వ తదితర ధోరణుల ధాటికి తట్టుకోలేక పెద్దపెద్ద నాయకుల నుంచి కార్యకర్తల వరకు వైసీపీని నిర్మొహమాటంగా విడిచిపెట్టేస్తున్నారు. మొన్నామధ్య జగన్ వైజాగ్‌కి వచ్చినప్పుడు కొణతాల తదితరులు ఆయన దగ్గరకి రాలేదని జగన్ సీరియస్ అయిపోయాడు. దాంతో కొరటాల నువ్వెంత, నీ పార్టీ ఎంత అని పార్టీకి రాజీనామా చేసిపారేశాడు. ఆ రాజీనామాని జగన్ బాధపడుతూనే ఆమోదించారని ఆయన పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి మరో పెద్ద గండి పడింది. కొణతాలకు అత్యంత సన్నిహితుడిగా వున్న మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూడా వైసీపీ రాజీనామా చేసిపారేశాడు. తాను కొణతాల రామకృ‌ష్ణ వెంటే నడుస్తానని ప్రకటించాడు. జగన్ ఉద్దేశపూర్వకంగానే పార్టీలోంచి ఒక్కొక్కరిని బయటకి పంపుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ నుంచి ఇంకా చాలామంది నాయకులు, కార్యకర్తలు త్వరలో బయటపడబోతున్నారని ఆయన వెల్లడించారు.