గచ్చిబౌలి ఫ్లైఓవర్ తిరిగి ప్రారంభమైన మూడు రోజుల్లోనే 300 కేసులు

 

హైదరాబాద్ నగరంలో ప్రమాదాలు రోజురోజుకీ పెరుగుతూనే పోతున్నాయి. గడిచిన రెండు వారాల్లోనే వరుస ప్రమాదాలు అధికంగా జరిగాయి. ప్రమాదాల నివారణకు నిబంధనలు.. వాహనదారుల కోసం సూచిక బోర్డులు.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా వాహనదారుల మైండ్ సెట్ మాత్రం మారట్లేదు. ఫ్లై ఓవర్ తిరిగి ప్రారంభించిన మూడు రోజుల్లోనే 300 పైగా కేసులునమోదయ్యాయి. ఓవర్ స్పీడ్, లైన్ క్రాస్, నో ఎంట్రీ, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు కొందరు ప్రయాణికులు.గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై జరిగిన ప్రమాదాలు పోలీసులకు , వాహన దారులకు అనేక పాఠాలు నేర్పాయి.

గచ్చిబౌలి ఫ్లై ఓవర్ ప్రారంభించిన అనంతరం దానిపై జరిగిన ప్రమాదాల కారణంగా నిర్మాణంలో మళ్ళీ లోపాలు ఉన్నాయా అనే సందేహాలు వెలువడ్డాయి. దీని పై ప్రభుత్వ నిపుణుల కమిటీ నియమించడమే కాకుండా కమిటీ సూచనలతో ఫ్లై ఓవర్ పై వేగ నియంత్రణకు స్పీడ్ బ్రేకర్ లు, సైనిక్ బోర్డ్ లు, రేడియం అలర్ట్ సూచికలు ఇలా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.ఇటీవల ఫ్లై ఓవర్ పై వాహనాలకు తిరిగి అనుమతిచ్చారు అధికారులు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వాహన దారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. ప్రారంభమైన మూడు రోజుల్లోనే బయోడైవర్సిటీ ఫ్లోర్ పై 300 పైగా కేసులు నమోదయ్యాయి. అతివేగంగా వెళ్లిన ముగ్గురు వాహనదారులపై కేసులు నమోదయ్యాయి.