దిశా కేసుకు మరణ ముగింపు.. నిందితులను అదే స్థలంలో ఎన్ కౌంటర్

 

దిశా నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దిశాను కాల్చి చంపేసిన స్థలంలోనే ఎన్ కౌంటర్ చేశారు. చటాన్ పల్లి వద్ద పోలీసుల నుండి తప్పించుకొని నలుగురు నిందితులు పారిపోతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని సీపీ సజ్జనార్ అధికారికంగా నిర్ధారించారు.
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశప అత్యాచారం కేసుకు మరణ ముగింపు లభించింది. ఘటన అనంతరం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ( డిసెంబర్ 6న ) అర్ధరాత్రి దాటాకా నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చర్లపల్లి జైలు నుంచి ఘటనా స్థలానికి రహస్యంగా తరలించారు పోలీసులు. తొండుపల్లి టోల్ గేట్ ప్రాంతంలో నిందితులు లారీ పక్కకి పెట్టిన స్థలాన్ని.. మద్యం తాగిన ప్రాంతన్ని..  పరిశీలించారు.  భూమిలో పాతిపెట్టిన దిశ ఫోన్ ను వారితోనే వెలికి తీయించారు. ఘటన రోజు ఏం జరిగిందో మొత్తం సీన్ అలానే చేసి చూపించమన్నారు. అలా వాళ్ళు చేసిన విధానాన్ని చూపిస్తూ అందులో ఇద్దరు ముందుగా పారిపోవడానికి ప్రయత్నించారు. ఆ తరువాత వీళ్ళని ఆపుతున్న తరుణంలో మరో ఇద్దరు కూడా అలానే చేయడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని అంటున్నారు. ఇంకా మృతదేహాలను బయటకు ఇవ్వలేదు. బహుశా పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను తల్లిదండ్రులకు లేదా సంబంధించిన కుటుంబీకులకు అప్పజెప్పవచ్చు.