59వ అంతస్తులో భారీగా మంటలు

 

దుబాయ్‌లో టార్చ్ టవర్ అనే ఒక భారీ భవనం ఉన్న విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన భవనం. ఈ భారీ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 59వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో వేలాదిమంది వున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై అందరినీ ఆ భవనంలోంచి సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. మంటలు భారీగా ఎగసిపడటంతో 59వ అంతస్తు పూర్తిగా పాడైపోయింది. 60వ అంతస్తు కూడా నాశనం అయిపోయింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ అంతస్తులో వున్నవారు, ఆ అంతస్తు పై అంతస్తులో వున్నవారు భయభ్రాంతులై ఒక్కసారిగా కిందకు రావడానికి ప్రయత్నించడంతో మెట్ల మీద తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట కారణంగా చాలామంది గాయపడ్డారు. ప్రాణనష్టం ఏమీ జరగలేదు. అయితే ఆస్తినష్టం భారీగా జరిగినట్టు తెలుస్తోంది. ఆకాశ హర్మ్యాలు కట్టేశామనో, కట్టేస్తామనో సంబరపడితే సరికాదు... ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురౌతాయని గుర్తుపెట్టుకోవాలి.