బడ్జెట్ విశేషాలు-1

 

కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ లోసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దేశాభివృద్ధి సాధించడానికి ఆర్ధిక క్రమశిక్షణ అవసరమని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేప్పట్టిన అనేక సంస్కరణలు, చర్యల వలన దేశంలో సానుకూల వాతావరణం స్పష్టంగా కనబడుతోందని అన్నారు. ఇదే ఆర్ధిక క్రమశిక్షణ పాటించినట్లయితే 2022 ప్రపంచంలో ఆగ్రదేశంగా ఎదుగుతుందని అన్నారు. ఈ ప్రయత్నంలో సబ్సిడీలపై కోత విధించాల్సి ఉంటుందని అన్నారు. సమాజంలో ఉన్నత ఆదాయ వర్గాలకు ప్రస్తుతం అందిస్తున్న గ్యాస్ సబ్సీడీని తొలగించి కేవలం సామాన్యులకు మాత్రం సబ్సీడీలు అందజేయలనుకొంటున్నట్లు తెలిపారు.