తెలంగాణ పోలీసులకు సినీలోకం సాల్యూట్... దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హర్షం...


తెలంగాణ పోలీసులకు సినీలోకం సాల్యూట్... దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హర్షం...

దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులకు సినీ పరిశ్రమ మొత్తం నీరాజనాలు పడుతోంది. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని సినీలోకం స్వాగతిస్తోంది. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ స్పందిస్తున్నారు. 

# తెలంగాణ పోలీసులకు చేతులెత్తి మొక్కుతున్నా, మనకు కష్టమొచ్చినా - కన్నీళ్లు వచ్చినా వచ్చేది పోలీసోడే - దర్శకుడు పూరీ జగన్నాథ్

# దిశకు న్యాయం జరిగింది... దిశ ఆత్మకు శాంతి చేకూరుతుంది - హీరో జూనియర్ ఎన్టీఆర్

# దిశ నిందితుల ఎన్ కౌంటర్ తోనే ఆగిపోవద్దు... దిశ ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది - హీరో రవితేజ

# ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది... నలుగురు చచ్చారనే వార్తలో ఇంత కిక్కుందా... ఆ బుల్లెట్లను దాచుకోవాలని ఉంది... ఆ తుపాలకు దండం పెట్టాలని ఉంది - హీరో మంచు మనోజ్

# దిశ నిందితుల ఎన్ కౌంటర్ వార్త వింటూ నిద్ర లేచాను... దిశ ఆత్మ శాంతిస్తుంది - హీరో నాగార్జున

# ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి... ఆ రౌడీ పోలీసోడై ఉండాలి - హీరో నాని

# దిశకు న్యాయం జరిగింది - హీరో అల్లు అర్జున్

# మంచి వార్త వింటూ నిద్ర లేచాను... తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులకు హ్యాట్సాప్ - హీరో మంచు విష్ణు

# దిశ కుటుంబ సభ్యుల ఆవేదన తీరదు... కానీ కొంతలో కొంత న్యాయం జరిగింది... దిశ ఆత్మ శాంతిస్తుంది - హీరో కల్యాణ్ రామ్

# తెలంగాణ పోలీసులకు నా సెల్యూట్ - హీరో విశాల్

# దిశ నిందితులకు సరైన శిక్ష పడింది... తెలంగాణ పోలీసులకు థ్యాంక్స్ - రకుల్ ప్రీత్ సింగ్

# ఈ భయం చాలా అవసరం - దర్శకుడు అనిల్ రావిపూడి

# దిశ నిందితుల ఎన్ కౌంటర్ ట్రెండింగ్ కావాలి.... సీపీ సజ్జనార్ కు నా సెల్యూట్ - దర్శకుడు హరీష్ శంకర్

# దిశకు పోలీసులు సరైన న్యాయం చేశారు... తెలంగాణ పోలీసులకు నా సెల్యూట్ - హీరో నిఖిల్

# సీఎం కేసీఆర్ కు థ్యాంక్స్... - మంచు లక్ష్మి