రైతుల పంటకు నిప్పు..  

posted on: Mar 22, 2021 4:46PM

చేతికి వచ్చిన పంట నోటికాడి రాకముందే.. పంటకు నిప్పు అంట్టించారు.  పాత కక్ష్యలు మనసులో పెట్టుకుని  పంటకు నిప్పు అంట్టించారంటూ బాధితులు గొల్లుమని ఏడ్చారు. గుంటూరు జిల్లా వినుకొండలో పంటలను తగలబెట్టడం కలకలం రేపుతోంది. రెండు రోజులలో  జరిగిన రెండు ఘటనలపై పోలీసులు దృష్టి  పెట్టారు. మందా వెంకటేష్ అనే రైతు రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని అప్పు చేసి మరి  మిరపపంట సాగు చేశాడు. పంట బాగా రావడంతో తన అప్పులన్నీ తీరిపోతాయని భావించాడు. తొలి కోతలోనే 30 క్వింటాల వరకు పంట వచ్చింది. కోసిన మిరప పంటను అంత  పొలంలోనే ఆరబోసాడు. కల్లంలో ఉన్న పంటను కొనడానికి కొందరు వ్యాపారాలు వచ్చి  క్వింటాను రూ. 14,500లకు కొనేందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. దీంతో ప్రత్యర్థులు రైతుపై ఈర్ష్య పడ్డారు. పాత కక్ష్యలను మనసులో పెట్టుకుని మిర్చి పంటకు నిప్పు అంటించారు. అప్పు తీరుందనుకున్న రైతు పంట మొత్తం తగలబడి ముడ్డిదైయింది. ఈ ఘటనతో రైతు వెంకష్ కుటుంబం కుంగిపోయి, కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.  

అలాగే నరగాయ పాలెంలో రైతు ఎర్రంరెడ్డి అంజిరెడ్డికి చెందిన 9 ఎకరాలు జామాయిల్ తోటకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో తోట పూర్తిగా తగలబడిపోయింది. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.  పోలీసులు అనుమానితుల వివరాలను బాధిత రైతుల నుంచి అడిగి తెలుసుకుని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత కక్ష్యలతోనే రైతుల పంటలను దగ్ధం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...