డబ్బుతో దొరికిన మాజీ మంత్రి భార్య : జగన్ పార్టీ వాటానా?

 

మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి జగన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి పార్థసారథి భార్య కమల గురువారం నాడు హైదరాబాద్‌లో 45 లక్షల రూపాయలతో పోలీసులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ డబ్బు ఎక్కడిదని పోలీసులు ప్రశ్నిస్తే కమలమ్మ ఏవేవో కాకమ్మ కథలు చెప్పిన విషయం పోలీసులు నమ్మడం లేదు. పోలీసులే కాదు... మెడకాయ మీద తలకాయ వున్నవాళ్ళెవరూ ఈ కథలు నమ్మరు. మచిలీపట్నంలో ఎన్నికల ఖర్చు కోసమే ఈ డబ్బు హైదరాబాద్ నుంచి తరలుతుందని ఎవరైనా చెబుతారు. అయితే ఈ డబ్బు హైదరాబాద్‌లో కమలకి ఎక్కడిదనే ప్రశ్నకు, జగన్ పార్టీ ద్వారానే వచ్చిందనే సమాధానాలు వస్తున్నాయి. మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి మాజీ మంత్రి పార్థసారథిని ఎలాగైనా గెలిపించాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్టు సమాచారం. ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగన్ తన పార్టీ వాటాగా పలు విడతలుగా డబ్బును అందజేస్తున్నారని, గురువారం దొరికిన డబ్బు కూడా ఈ వాయిదాల్లో భాగంగా ఇచ్చినదేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.