కొత్తనాయకులే కరువా

Draught for New Leaders, Party Jumpings From All Political Parties, YSRCP, New Leaders, Senior NTR New Party, Youth Attracted, Youth Leadership,

 

అన్ని పార్టీలనుండి వైసిపి లోకి వలసలు, కప్పదాట్లు, గోడదాటటాలు ఎక్కు వయిపోయాయి. తీన్ని చూసిన ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ అధినాయకత్యం కొత్త నాయకులను తయారు చేసికోలేరా అనే సందేహాన్ని సందిస్తున్నారు.

 

గతంలో ఎన్టీరామారావు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు యువతను ఎంతగానో ఎట్రాక్ట్ చేశారు. ఆయన పేరు చెప్పి ఏ ఎన్నికల్లో ఎవరూ నిలబడినా......ఊరూ పేరు లేని వారుకూడా ఎమ్మేల్యేలుగా ఎంపిలుగా మారారు. రాష్ట్రంలో కొత్తతరానికి చెందినవారు నాయకులుగా మారారు.  యువత రాజకీయాలలోకి రాజబాటలో ప్రయాణించారు.

 

ఇప్పటికీ యువత నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉన్నా గత మూడేళ్లనుండి యువతను పార్టీలోకి తేవడానికి వైయస్సార్ కాంగ్రెస్ ఏ మాత్రం శ్రద్ద చూపకుండా పాతనాయకులనే తమ పార్టీలోకి ఆహ్వానించడం పలువిమర్శలకు తావిస్తుంది. కొత్తపార్టీ కొత్త నాయకత్వం లేకుండా పాత నాయకత్వం తో పనిచేయడం వల్లే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ  ఎన్నికల్లో గెలుపు సాధించ లేక పోయిందని రాజకీయవర్గాలు ఉటంకిస్తున్నాయి.