జనవరి 20న ట్రంప్ ప్రమాణస్వీకారం..

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన జనవరి 20న వైట్ హౌజ్ ప్రవేశం చేయనున్నారు. ఆరోజు ఆయన 45వ దేశాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా, ఈ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పార్టీ 276, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 218 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.