ట్రంప్ కు మోడీ అభినందనలు..


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ట్రంప్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోడీ  శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా 45వ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థానాలకు చేరతాయని ఆశిస్తున్నానని మోదీ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.