చైనా అధ్యక్షుడితో నేను మాట్లాడలేదు...

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ చైనా పై విమర్శలు చేయడం కొత్తేమి కాదు. ఆయన ఎన్నికల ముందు ప్రచారంలో ఉన్నప్పుడే ఎన్నోసార్లు చైనాపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు మరోసారి చైనాపై  ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం ట్రంప్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌తో మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. చైనా అధ్యక్షుడు ఫోన్‌ చేసి ఆయన్ను అభినందించినట్టు చైనా సెంట్రల్‌ టీవీ వెల్లడించింది. అయితే ఈ వార్తలపై స్పందించిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తాను చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌తో మాట్లాడలేది ట్రంప్‌ చెప్పారు.. మీడియాలో వచ్చిన కథనాలను తోసిపుచ్చారు. చైనా అధ్యక్షుడితో తప్ప చాలా మంది ప్రపంచ నేతలతో మాట్లాడానని, అభినందనలు అందుకున్నానని చెప్పారు. ట్రంప్‌ ప్రతినిధి హోప్‌ హిక్స్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.