బయటకొచ్చిన పాత ట్రంప్...

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే విజయం అనంతరం ట్రంప్ చాలా నెమ్మదిగా.. కూల్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు విజయం తరువాత ట్రంప్ పాల్గొన్న మొదటి సమావేశంలో కూడా ఆయన చాలా మృదువుగా మాట్లాడారు. అంతేకాదు వైట్ హౌస్ లో ఒబామాతో భేటీ అయిన ట్రంప్ గతంలో తాను చేసిన వ్యాఖ్యలన్నింటిని కూడా పక్కనపెట్టి ఒబామాపై ప్రశంసలు కురిపించారు. అయితే ఇప్పుడు ట్రంప్ మళ్లీ తన శైలిలోకి అప్పుడే వచ్చేశారు. దీనికి కారణం.. ఆయన ఎన్నికను నిరసిస్తూ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో తోపాటు తదితర ప్రాంతాల్లో ఆందోళనలే కారణం. తన గెలుపుపై చేస్తున్న ఆందోళనలపై స్పందించిన ట్రంప్.. చాలా నిష్ఫక్షపాతంగా, విజయవంతంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయని.. ఇప్పుడు ఆందోళన చేస్తున్నవారంతా డబ్బుతీసుకొని ఈ పనిచేస్తున్నారని, ప్రొఫెసనల్ ఆందోళనకారులని ట్విట్టర్లో ఆరోపించారు. దీని వెనుక కచ్చితంగా మీడియానే ఉందంటూ మరోసారి ఆయన నిందించారు.