45వ అధ్యక్షుడిగా ట్రంప్.. ఆ సమయం వచ్చింది...

 


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ అధికారాన్ని చేపట్టనున్నారు. ట్రంప్ వివాదాలు, విమర్శలు పట్టించుకోని అమెరికన్లు ఆయనకే పట్టం గట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో విజయానికి సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..ప్రపంచంలో అమెరికా ఎప్పుడూ నెంబర్ వన్ గానే ఉంటుంది.. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తానని తెలిపారు.అమెరికాలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పిస్తా.. ప్రజలందరి ఆక్షాంక్షలు నెరవేరుస్తాం.. మనం చేసింది ప్రచారం కాదు ఉద్యమం..ప్రభుత్వం అందరిది.. అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.