క‌రోనా సోకినా 80% మందికి ప్రాణ‌హాని వుండ‌దట‌!

ప్రతి  ఒక్కరూ సామాజిక దూరం పాటించడం ద్వారా  కరొనా వైరస్ ను నిర్మూలించవచ్చని గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ విభాగధిపతి డాక్టర్ వినయ్ శేఖర్, అపోలో ఆస్పత్రి కన్సల్టెంట్ డాక్టర్ విష్ణు రావులు ప్రజలకు సూచించారు. శుక్రవారం సమాచార   పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ 19  పై ప్రజలకు అవగాహన కల్పించెందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా డాక్టర్ వినయ్ శేఖర్ మాట్లాడుతూ కరోనా వైరస్ అన్ని వైరస్ లాంటదేనని, వైరస్ సోకిన ప్రతి వందమందిలో ఎనభై ఐదు శాతం మంది కి ప్రమాదం ఏమి ఉండదని స్పష్టం చేశారు. వృద్ధులు కు వైరస్ సోకిన ప్పుడు మాత్రమే ప్రమాదం పొంచి ఉంటుందనీ, వీరు డాక్టర్ల సూచనలు, సలహాలు పాటించాలని తెలిపారు. ఈ వైరస్ ప్రధాన లక్షణాలు జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తల నొప్పి వంటివి కూడా రావచ్చుఅని అన్నారు.

ఈ లక్షణాలకు ఉన్నప్పుడు శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తూ ఎక్కువ మోతాదులో ద్రవాలు అందించటం వంటివి చేయాలని అన్నారు. మనం ఈ వైరస్ ను శ్వాస లోకి పీల్చినపుడు లేదా ఈ వైరస్తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు కళ్ళు , ముక్కు , నోటి ద్వారా ఇది మన శరీరంలోకి చొరబడుతుంది.

తరుచుగా చేతులను సబ్బు నీటితో గానీ, శానిటైజర్లుతోగాని శుభ్రంగా కడుక్కొవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో నే ఉండాలని, స్వీయనిర్బందంలో ఉండాలని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. కరొనా సోకిన వారికి   ప్రత్యేక చికిత్స అందించడం ద్వారా చాలా మంది రికవరీ అయ్యారని వివరించారు.

డాక్టర్ విష్ణు రావు మాట్లాడుతూ వయసు ఎక్కువ ఉన్న వారు ముఖ్యంగా కిడ్నీ, గుండె , లివర్ వంటి వ్యాధులు ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.సాధారణ ప్రజలు ఎన్ - 95 మాస్క్ లు వేసుకోవాలిసిన అవసరం లేదన్నారు. కరోనా సోకిన వారికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు వేసుకోవాలి. ఎవరికైనా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్నాయో వారికి మాస్క్ వేసుకోవాలి. గుంపులలో తిరిగెటప్పుడు కూడా మాస్క్ వేసుకోవలన్నారు. మాస్క్ కేవలం ఒకేసారి వినియోగించాలని సూచించారు. క్లోరోక్విన్ లాంటి మందులను డాక్టర్ సలహా లేకుండా వేసుకోకూడదాని తెలిపారు. మాంసాహారం ద్వారా కరోనా వైరస్ సోకదాని ఆయన స్పష్టం చేశారు. ఆహారాన్ని పూర్తిగా శుభ్రం చేసి సరిగా వండి స్వీకరిస్తే ఎటువంటి అపాయం లేదు అన్నారు.