స్టాలిన్ కు తప్పిన ప్రమాదం..

 

డీఎంకే నేత ఎమ్‌కే స్టాలిన్‌కు తృటిలోప్రమాదం తప్పింది. ఆయన కారు ప్రమాదానికి గురైంది. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాల ప్రకారం.. స్టాలిన్ ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు కారులో చెన్నై నుంచి ధర్మపురికి వెళ్తుండగా..పల్లికొండ టోల్‌గేట్‌ వద్ద కారు ఆగివున్న సమయంలో వెనక నుంచి మరో కారు ఓవర్‌టేక్‌ చేయబోయి స్టాలిన్‌ కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కాన్వాయ్‌లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే ఆయన్ని మరో వాహనంలో ఎక్కించారు. ఈ ప్రమాదంలో స్టాలిన్‌కి ఎలాంటి గాయాలు కాలేదు.