నటి ఖుష్బు పై చెప్పులతో దాడి

 

 

DMK leader Kushboo's house in Chennai attacked by party workers, House of actor and DMK member Khushboo attacked

 

 

డీఎంకే చీఫ్ కరుణానిధి వారసత్వంపై ఖుష్బు చేసిన వ్యాఖ్యలపై తమిళ నాడులో ఆమెకు నిరసనలు ఎదురవుతున్నాయి. తిరుచ్చిలో జరిగిన డీఎంకే సభలో పాల్గొనేందుకు వెళ్ళిన కుష్బు పై రాళ్ళు, చెప్పులతో కొనదరు దాడి చేశారు. పోలీసులు వారిని పట్టుకోనేలోపు ఖుష్బూ డీఎంకే వ్యతిరేకి, స్టాలిన్ కి వ్యతిరేకి అని అరుస్తూ పారిపోయారు. ఈ ఘటనలో కుష్బుకు గాయలేమి కాలేదు.


మరోవైపు కొంతమంది వ్యక్తులు కుష్బూ ఇంటిపై రాళ్ళదాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో ఆమె కారు అద్దాలు పగిలాయి. ప్రహరీపై ఉన్న విద్యుద్దీపాలను ధ్వంసం చేసిన స్టాలిన్ అభిమానులు.. ఖుష్బూ క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు.


ఖుష్బూ తాను చేసిన వ్యాఖ్యల పై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వారు అపార్థం చేసుకున్నారని ఖుష్బూ ఆవేదన వెలిబుచ్చారు. తాను స్టాలిన్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. పార్టీకి తాను విశ్వాసపాత్రురాలినని, పార్టీ నేతల ఆజ్ఞను శిరసావహిస్తానని అన్నారు.