కాంగ్రెస్ లో వర్గపోరు రచ్చకెక్కింది

 

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలు చెలరేగాయి. కాంగ్రెస్ అధిష్ఠానం జైపాల్ ను కాదని కిరణ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేసింది. మరొక వైపు మహబూబ్ జిల్లాలో కేంద్రమంత్రి జైపాల్ కు రాష్ట్రమంత్రి డి.కె.అరుణల మధ్య ఆధిపత్య, వర్గపోరు ఉంది. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంలో తాగునీటి సమస్య నివారణకు 100కోట్ల నిథులను కేటాయించి ఆ పనులను ప్రారంభించేందుకు, ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు విచ్చేశారు. వారితో పాటు రాష్ట్ర మంత్రులు సుదర్శన్ రెడ్డి, జానారెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపి మంథా జగన్నాథం, ఎమ్మెల్యేలు రాములు, జైపాల్ యాదవ్, జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారులు జిల్లా ఇన్ ఛార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా రాష్ట్రమంత్రి డి.కె. అరుణలకు ఆహ్వానాలు పంపించారు. కానీ వీరిద్దరూ గైర్హాజరయ్యారు. కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అనునాయులకు కట్టబెట్టారని డి.కె.అరుణ అనుచరులు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో జైపాల్ రెడ్డి, డి.కె. అరుణల మధ్య వర్గపోరు బహిర్గతం అయ్యిందని.