కొండా దంపతులకు దిగ్విజయ్ డిసపాయింట్మెంట్

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకొన్న తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకి వచ్చిన కొండా సురేఖ దంపతులు తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకొనేందుకు మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ ను ఆశ్రయించారు. ఆయితే ఆయన రాయభారం పనిచేయలేదని సమాచారం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కలవాలనుకొన్న కొండా దంపతులకు ఆయన అప్పాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం. గతంలో వైకాపాలో ఉన్న సమయంలో వారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని వారు తీవ్రంగా దూషించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోయినట్లతే, వారు బీజేపీలో చేరే అవకాశం ఉంది. అదే జరిగితే, తెలంగాణా ప్రాంతంలో ఇంకా బలహీనంగానే ఉన్న బీజేపీ మరింత బలపడి, మరికొన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకొనే వీలుకలుగుతుంది. ఇది కాంగ్రెస్ తెరాస రెండు పార్టీలకి నష్టమేనని చెప్పవచ్చును.