ధ‌ర్మాన, స‌భిత‌ల‌కు ఊర‌ట‌

 

ధ‌ర్మాన స‌భితా ఇంద్రారెడ్డిల‌కు సిబిఐ కోర్టులో ఊర‌ట ల‌భించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడార‌న్న అభియోగాల‌ను ఎదుర్కొంటున్న వీరికి నాంప‌ల్లి కోర్టులో అనుకూల తీర్పు వ‌చ్చింది. ధ‌ర్మాన, స‌భితల‌ను త‌మ క‌స్టడికి అప్పగించాలంటూ కోరిన సిబిఐ వాద‌న‌ను కోర్టు కొట్టి వేసింది.

జ‌గ‌న్ అక్రమాస్తుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు సాక్షుల‌ను బెందిరించి తారుమారు చేసే అవ‌కాశం ఉందంటూ సిబిజఐ చేసిన ఆరోప‌ణ‌ను కోర్టు తోసి పుచ్చింది. సిబిఐ దాఖ‌లు చేసిన మెమోపై వాదోప‌వాద‌న‌లు విన్న కోర్టు ధ‌ర్మాన స‌భిత‌ల‌ను వాద‌న‌ను స‌మ‌ర్ధించింది.

గ‌తంలో వారు మంత్రులుగా ఉన్నారు క‌నుక సాక్షులను ప్రభావితం చేసే అవ‌కాశం ఉంది కాని వారు ఇప్పుడు ప‌ద‌వుల‌లో లేరు గ‌నుక ఆ అవ‌కాశం లేద‌ని భావించిన కోర్టు ధ‌ర్మాన స‌భిత‌ల క‌స్టడికి నిరాక‌రించింది.