వెనక్కి త‌గ్గే ప్రస‌క్తే లేదు

 

తెలంగాణ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు ఏస్థాయిలో ఉన్నా విభ‌జ‌న విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేదంటూ కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి ప్రక‌టించింది. ఈ మేర‌కు కాంగ్రెస్ వ్యవ‌హారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రక‌ట‌న చేశారు. తెలంగాణ ప్రక్రియను కొనసాగించే బాధ్యత భారత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామ‌న్న ఆయ‌న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కొన‌సాగుతుంద‌న్నారు.

ప్రక‌ట‌న నేప‌ధ్యంలో స‌మ్మె దిగ‌బోతున్న ఏపి ఎన్జీవోల‌ను స‌మ్మె విర‌మించుకోవాల‌ని కోరారు. ఏ ప్రాంత వారైన త‌మ అభిప్రాయాల‌ను ఆంటోని క‌మిటీకి విన్నవించుకోవ‌చ్చన్నారు. రాష్ట్ర విభజన జరిగినందువల్ల సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఎవరు ఎక్కడైనా స్థిరపడవచ్చు, జీవించవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామన్నారు.

ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యల‌పై స్పందించిన దిగ్వజ‌య్‌, ఆయ‌న‌తో మాట్లాడాన‌న్నారు. సియంపై ఎలాంటి వివ‌ర‌ణ కోర‌లేద‌న్న ఆయ‌న ఎలాంటి చ‌ర్యలు కూడా ఉంబడ‌బోవ‌ని తేల్చిచెప్పారు.