తప్పుడు మనుషులు... తప్పుడు కూతలు...

 

పాపం కడియం శ్రీహరి ఎంపీ అయ్యారు... ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయితే ఆయన దళితుడు కావడం వల్ల ఈ స్థాయికి రాగలిగారు. అయితే కడియం శ్రీహరి అసలు దళితుడే కాదన్న ఆరోపణలు వినిపిస్తూ వున్నాయి. కడియం శ్రీహరి తల్లిదండ్రులిద్దరూ బీసీలు. అలాంటప్పుడు ఆయన దళితుడు ఎలా అయ్యారన్నది వివాదం. దళితుడైన రాజయ్యకు అన్యాయం చేసి దళితుడు కాని కడియం శ్రీహరిని అందలానికి ఎక్కించారన్నది ఆరోపణ. ఈ విషయంలో కడియం శ్రీహరిమీద టీడీపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. డియం శ్రీహరి ఎన్నికల్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారంటూ మోత్కుపల్లి ఆరోపిస్తున్నారు. వీటి మీద కడియం శ్రీహరి స్పందించారు. తాను డిప్యూటీ సీఎం కావడం నచ్చని తప్పుడు మనుషులు తప్పుడు కూతలు కూస్తున్నారని ఆయన అన్నారు. తాను చిత్తశుద్ధితో పని చేసే వ్యక్తినని తప్పు చేసే వ్యక్తిని కాననని, తాను తప్పు చేసినట్టు రుజువు చేస్తే ఉరిశిక్షకైనా సిద్ధమేనని ఆయన అన్నారు. తాను మాదిగ ఉప కులానికి చెందిన వాడినని ఆయన తెలిపారు.