ఢిల్లీ కాలుష్యం..1800 స్కూళ్ల‌కు సెల‌వు..

 

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాలుష్యాన్ని నివారించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం వర్కవుట్ కావట్లేదు. గత కొద్ది రోజుల నుండి ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందన్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఢిల్లీలో కాలుష్యం నమోదైంది. కాలుష్యంలో పీఎం స్థాయి 1200 మైక్రోగ్రామ్స్ దాట‌డంతో ప్ర‌భుత్వం స్కూళ్ల మూసివేత‌కు ఆదేశాలు జారీ చేసింది. సుర‌క్షిత స్థాయి కంటే 13 రేట్లు ఎక్కువ‌గా కాలుష్యం ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఈ నేపథ్యంలో ప్ర‌భుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే.. ఢిల్లీలో ఉన్న 1800 ప్రైమ‌రీ స్కూళ్ల‌కు ఇవాళ సెల‌వును ప్ర‌క‌టించారు. దీని వ‌ల్ల సుమారు 9 ల‌క్ష‌ల మంది చిన్నారులు స్కూల్‌కు దూరంకానున్నారు.