ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి కిరణ్ బేడీ?

 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేశ తొలి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ పేరును ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా కిరణ్ బేడీ‌పై నమోదై వున్న చీటింగ్ కేసును విరమించుకోడానికి ఢిల్లీ పోలీసులు క్లోజర్ రిపోర్టును బుధవారం నాడు దాఖలు చేశారు. అన్నా హజరే చేసిన అవినీతి వ్యతరేక ఉద్యమంలో పాల్గొన్న సమయంలో ప్రజలు ఇచ్చిన విరాళాల దుర్వినియోగం, కంప్యూటర్ల కొనుగోళ్ళలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కిరణ్ బేడీపై వచ్చాయి. దీంతో పోలీసులు కిరణ్ బేడీపై చీటింగ్ కేసును నమోదు చేశారు. ఆమెపై ప్రస్తుతం వున్నచీటింగ్ కేసు విరమించుకోగానే ఆమె బీజేపీలో చేరడం, కిరణ్ బేడీని ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం చకచకా జరిగిపోతాయని విశ్వసనీయంగా తెలుస్తోంది.