బొగ్గు స్కాంలో దాసరిని విచారించిన సిబిఐ

Publish Date:May 14, 2013

 

 

dasari narayana rao cbi, dasari narayana rao coal scam, coal scam dasari narayana rao

 

 

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణంలో మన రాష్ట్రానికి చెందిన దాసరి నారాయణ రావు పేరు వినిపించడం సర్వత్రా చర్చనీయంశమైంది. యూపీఏ 1 హయంలో బొగ్గు సహాయ మంత్రిగా పదవి చేపట్టిన దాసరి, ఇష్టారాజ్యంగా బొగ్గు కేటాయింపులు జరిపారనే ఆరోపణలు వున్నాయి. ఈ ఆరోపణలపై దాసరి ఎప్పుడు పూర్తి స్థాయిలో స్పందించలేదు. తాజాగా బొగ్గు కుంభకోణానికి సంబంధించి దాసరి నారాయణ రావు సీబీఐ విచారించింది. గత నెలలో దాసరిని విచారించినట్లు సిబిఐ వెల్లడించింది. అయితే ఆ విచారణలో దాసరి ఏమి వెల్లడించారనేది తెలియాల్సివుంది.