దానం నాగేందర్ వార్నింగ్

Publish Date:Mar 24, 2013

Danam Nagender Warning to Corporator, Warning to Corporator by Danam Nagendra, Danam Nagendra State Minister Warns Corporator

 

బంజారాహిల్స్ లోని భగత్ సింగ్ నగర్ అభివృద్ధి కోసం ప్రతియేటా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి, బిజెపి పోటీచేస్తుంటాయి. ఈ సంవత్సరం జరిగే  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకటేష్, నాగరాజు అనే ఇద్దరు రెండు ప్యానల్స్ గా ఏర్పడి పోటీ చేశారు. వీరిద్దరూ తమ ప్యానెల్ కే మద్ధతునివ్వాలని కార్పోరేటర్ ను కోరారు. కార్పోరేటర్ ఒక వర్గానికి తన మద్ధతు ప్రకటించారు. దీంతో నిరాశకు గురైన రెండవ ప్యానల్ మంత్రి దానం నాగేందర్ దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో దానం కార్పోరేటర్ ను పిలిచి ఆగ్రహం వ్యటం చేసినట్లు తెలిసింది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్యా సయోధ్య కుదర్చాలి గాని ఏదో ఒక అభ్యర్థికి మద్ధతు తెలిపితే ఎలా అని గట్టిగా మందలించారు. కార్పోరేటర్ ఆ ఇద్దరు అభ్యర్థుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా విఫలమవడంతో ఆదివారం జరిగిన ఎన్నికల్లో వెంకటేష్ ప్యానెల్ విజయం సాధించింది. నాగరాజు వర్గ ప్యానెల్ ఓటమి పాలైంది. దీంతో ఒకే పార్టీలో వర్గాలు ఏర్పడటం మంచిది కాదని దీని పర్యవసానం భవిష్యత్తులో ప్రతిఫలిస్తుందని భగత్ సింగ్ నగర్ వాసులు వాపోతున్నారు