జగన్ సర్కార్ పై కార్మికుల ఆగ్రహం

 

చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇలాంటి భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక ఫండ్ ను ఏర్పాటు చేసి ఆ ఫండ్ ద్వారా ఏ కుటుంబానికైనా ఆపద వస్తే ఆదుకోవటం ఏ రంగానికైనా ఇబ్బంది వస్తే ఆ రంగాన్ని ఆదుకోవటం, అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు దురదష్టవశాత్తు ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే.. అనారోగ్యంతో చనిపోతే రెండు లక్షలు, ప్రమాదవశాత్తూ చనిపోతే అయిదు లక్షల రూపాయలు అందించటం వల్ల పేద వర్గాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఏ ఇబ్బందులూ లేకుండా ఉన్నాయి.ఇంట్లో తల్లి లాంటి ప్రభుత్వాన్ని వదులుకొని ఏదో కొత్త పెళ్లి కూతురు కోసం కొత్త పెళ్ళాం కోసం మోజు పడినట్టుగా ఒక్క ఛాన్స్ ఇచ్చాం. ఇవాళ అదే భస్మాసురహస్తంలాగా మానెత్తి మీద చేయిపెట్టాడు అని ఒక కార్మికుడు కడుపు మంటతో మాట్లాడుతున్నట్లు తెలియజేశారు.

రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పెయింటింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె రాజుగారు ఒక్క భవన నిర్మాణ రంగం అంటే ఒక తాపీ మేస్త్రి, ప్లంబరో, ఒక కార్పెంటరో ఒకటైల్స్ వేసేవాళ్లో ఒక  ఎలక్ట్రిషన్ ఏ కాదు,దాదాపు అనేక వంద సంస్థలపై నా ఈ రంగం మీద ఆధారపడి వుంటాయని దాంట్లో ఒకటి పెయింటర్స్ రంగం ఇలా ఎన్నో సోషల్ యూనియన్లు  కూడా వచ్చి వాళ్ళ సమస్యలు కష్టాల కూడ చెప్పుంటారు. వీళ్లందరూ ఈ సమస్యలు సుడిగుండంలో పడటానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి  మరియు ఒకే ఒక్క ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అని ఆరోపించారు.తాన తప్పు వల్ల ఇవ్వాల అందరూ ఒక పెయింట్ షాప్ అంటే కేవలం ఆయన ఒక్కడే కాదు బతికేది ఆయన దగ్గర ముఠావాళ్ళు కూడా బతుకుతారు, గుమస్తాలు,మేస్త్రీలు బతుకుతారు. ఎన్నో రంగాల్లో ఎంతమంది వ్యక్తులు ఆ పెయింట్ షాప్ మీద ఆధారపడి బతికే పరిస్థితులో దాదాపు ఏడు నెలల నుంచి ఇవాళ వాళ్ళు ఏ వ్యాపారం లేకుండా పోయిందంటే కనీసం భవిష్యత్తులో అయిన బావుండదంటే అది కూడా లేకుండా ఇష్టారీతిన పరిపాలన కొనసాగుతోందని పెయింటింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజుగారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.