భార్య భర్తల మధ్య పార్టీ భేదాలు... దగ్గుబాటిని రాజకీయాలకు దూరం చేయనుందా?

ఎన్టీఆర్ పెద్దల్లుడు మాజీ సీఎం చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ భవిష్యత్ ఏంటనేది  ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కూడా చాలా జోరుగా చర్చ జరుగుతోంది. మొన్న జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పరుచూరు నియోజక వర్గం నుంచి మొదట హితేష్ చెంచురామ్ పోటీ చేద్దామని అనుకున్నారు. అయితే దాని కొంతకాలానికి ముందే దగ్గుపాటి వెంకటేశ్వరావు కొడుకు హితేష్ తో కలిసి వైసిపి పార్టీలో చేరారు. అయితే హితేష్ చెంచురామ్ అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడం కొన్ని సాంకేతిక కారణాల రీత్యా టికెట్ కేటాయించడం కుదరకపోవటంతో ఆఖరి నిమిషంలో పర్చూరు నియోజక వర్గం నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరావు పోటీకి బరిలో నిలిచారు. అయితే అక్కడి నుంచి టిడిపి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గట్టిపోటీనివ్వడం దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి కూడా కొంత మెరకు దగ్గుపాటి వెంకటేశ్వరరావు వైసీపీ పార్టీలు కాస్తా క్రియాశీలకంగా ఆక్టివ్ గా లేకుండా ఉండిపోయారు.

ఓటమికి కారణం ఒకటైతే కొంత ఆయన కూడా ఆక్టివ్ గా కొనసాగటం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ చాలా దూకుడుగా ఉంది. వచ్చే ఎన్నికలకి తామే వైసీపీకి ఎలా అయినా సరే పోటీ ఇస్తాము అని వెల్లడించింది.వైసీపీ కి బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని బీజేపీ నాయకులు చాలా గట్టిగా ఉన్నారు. బీజేపీ కూడా చాలా దూకుడు రాజకీయం వ్యవహరిస్తోంది. ఇలాంటి సమయంలో జగన్ తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును పిలిచి కొంత అల్టిమేటం వార్నింగ్ లాంటి ఇచ్చారని చెప్పి వార్తలూ బయటకొచ్చాయి. అది కూడా ఏంటంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావుని జగన్ పిలిచి బిజెపి పార్టీలో ఉన్న పురందేశ్వరిని బీజేపీ కి రాజీనామా చేసి ఇద్దరు కూడా ఒకే పార్టీలో కొనసాగాలని చెప్పి లేదా ఈయన కూడా పార్టీకి రాజీనామా చేసేయాలి అన్నట్టుగా, ఉంటే ఇద్దరు కుటుంబ సభ్యులు వైసిపిలోనే కొనసాగాలని బీజేపీ నుంచి వచ్చేసి, లేద ఈయన పార్టీ నుంచి రాజీనామా చేసేయాలని అల్టిమేటన్ జారీ చేశారన్న వార్తలు ఒక్కసారి గుప్పుమన్నాయి.ఇక దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.