హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ చుక్కెదురు...

 

హుజూర్ నగర్  ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.హుజూర్ నగర్ ఎన్నికలు అంటే అందరిలో చర్చనీయంశంగా మారిన విషయం అనే చేప్పుకోవచ్చు. ప్రచారానికి మిగిలింది కేవలం అయిదు రోజులే కారణంగా పార్టీల అభ్యర్ధులు, మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయిలో సాగిన ప్రచారం ఇప్పుడు ఇంకొంచెం జోరందుకుంది. మరోవైపు సరిగ్గా పోలింగ్ కు ఆరు రోజుల ముందు సిపిఐ యూటర్న్ తీసుకుని టీఆర్ఎస్ కు షాకిచ్చింది. సీపీఐ యూటర్న్ వెనుక ఆర్టీసీ సమ్మె సెగ తగిలుంటుందనే భావన అందరిలో నెలకొంది. 

సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుందని, కొత్త రిక్రూట్మెంట్ ప్రకటించి నిరుద్యోగ యువకులను, ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా  ఘర్షణ వాతావరణం కలిగిస్తున్నదని వెల్లడిస్తున్నారు.ఈ వైఖరిని మార్చుకోమని సీపీఐ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ సమ్మె కారణంగా కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతు వారి ప్రాణాలు కోల్పోతున్నారు. మానసిక వేదనతో కొందరు మరణించగా, గుండె పోటుతో ఇంకొందరు మరణిస్తున్నారు. పరిష్కారం బదులు ప్రభుత్వం మరింత మొండిగా వ్యవహరిస్తున్న తీరును చూసి ఆశ్చర్యపోతున్నారు ఇతర పార్టీ నేతలు. ఈ పరిస్థితుల్లో సీపీఐ కార్మికవర్గ పార్టీగా, శ్రామిక వర్గ పార్టీగా స్పందించి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సీపీఐ, టీఆర్ఎస్ కు ప్రకటించిన మద్దతును ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇవాళ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హుజూర్ నగర్ రోడ్ షో ని నిర్వహించబోతున్నారు. పదిహెడువ తేదీ సీఎం కేసీఆర్ ప్రచారానికి వెళ్ళనున్నారు అని సమాచారం. పధ్ధెనిమిది, పంతొమ్మిదివ తేదీల్లో కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు.  ఎలక్షన్లల్లో విజయం సాధించలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ మొదటి నుంచి ముందుకు సాగే ప్రయత్నాలు చేసింది.దీనికి సీపీఐ మద్దత్తు కూడా తోడవ్వడంతో మంచి జోరు మీద ఉంది కారు పార్టీ. కానీ ఆర్టీసీ సమ్మే సెగ కారణంగా సీపీఐ తమ మద్దత్తును ఉపసంహరించుకుంది.కేవలం ఐదు రోజులు మాత్రమే ప్రచారానికి ఉన్న సందర్భంగా ప్రతి పార్టీ నేతలు వారి గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు . టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి తన గెలుపు కోసం, పార్టీ కోసం ఐదు రోజులు ఎన్నికల ప్రచారంలో దిగి పెద్దెత్తున ఓట్లు పొందాలన్న ఉద్దేశంతో ప్రాచారం కొనసాగిస్తుండగా,  కాంగ్రెస్ కూడా అదే పనిలో ఉంది. కానీ ఏదేమైనా కూడా ఈ నియోజక వర్గాలలో హోరాహోరిగా  కాంగ్రెసు, టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది.మొత్తం మీద ఈ ఐదు రోజుల పాటు ఈ ప్రచారాన్ని ఎలా వినియోగించుకోవాలన్న లక్షంతో అన్ని పార్టీలు బిజీబిజీగా ముందుకు సాగుతున్నాయి.