మాజీ సర్పంచ్ దంపతుల ఔదార్యం!

కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో ఓ సర్పంచ్ ల జంట ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలబడాలని ప్రతిన బునింది.అందుకు అనుగుణంగా తమ గ్రామంలో వైరస్ ను కట్టడి చేసేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ధాన్యాన్ని దానంగా ఇవ్వాలని సంకల్పించారు.

సూర్యపేట జిల్లా హుజుర్నగర్ మండలంలోని బురుగడ్డ గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ దేశముఖ్, రాధిక అరుణ్ కుమార్ దేశముఖ్ ల దంపతులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఊరు వాడ స్వాగతిస్తుంది. వరుసగా 10 సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు భర్త అరుణ్ కుమార్ దేశముఖ్ ఆ తరువాత ఐదు సంవత్సరాలు భార్య రాధిక అరుణ్ కుమార్ దేశముఖ్ లు సర్పంచ్ లు గా వ్యవరించిన ఆ గ్రామంలో పారిష్యుద్య కార్మికులు పడుతున్న శ్రమ ను గుర్తించి ఒక్కొక్కరికి బస్తా ధాన్యం దానం చెయ్యాలని నిర్ణయించారు. 

అనుకుందే తడవుగా తమ కల్లాల వద్దనే ఆ ధాన్యాన్ని పారిష్యుద్య కార్మికులకు అందించే విదంగా వారిని అక్కడికే పిలిపించి ధాన్యాన్ని అంద జేశారు.అరుణ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతించడం తో పాటు విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉండడం తో పాటు ప్రజలకు సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పలువురు కోరుతున్నారు.