కాంగ్రెస్ కు షర్మిల సవాల్

 

 

 congress ysrcongress, ys sharmila congress, congress jagan, jagan ys sharmila

 

 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరారు. పాదయాత్ర వందరోజులుకు చేరుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఇటీవల అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాపక్షం తరఫున నిలబడ్డ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయగలరా…అంటూ ఆమె విరుచుకపడ్డారు.

 

కొనసాగింపుగా…దమ్ముంటే వారిపై వేటు వేసి.. ఎన్నికలకు వెళ్లాలని ఆమె అన్నారు. ఎన్నికలు వస్తే డిపాజిట్లు కూడా దక్కవని కాంగ్రెస్ కు భయమని షర్మిల ఎద్దేవా చేశారు. ఈ విధంగా షర్మిల తన పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా వ్యాఖ్యానాలు చేశారు.