వలస బాటలో తెరాస నేతలు

 

 TRS Congress, Congress trs leaders, telangana congress

 

 

తెలంగాణ పై కాంగ్రెస్‌ సానుకూలంగా అడుగులు వేస్తుండటంతో టిఆర్‌ఎస్‌ వర్గాలు గుబులు రోజు రోజుకు ఎక్కువవుతుంది. కాంగ్రెస్‌ ఎత్తులతో ఇప్పుడు చాలా మంది టిఆర్‌ ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ తలుపు తడుతున్నారు. ఎలాగూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్‌ ఎస్‌ కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది కాబట్టి తాము అంతకన్నా ముందే ఆ పార్టీలో చేరడం మేలని భావిస్తున్నారు.

 

ఇప్పటికే టిఆర్‌ఎస్‌ ఎంపి విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీకి అనూకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణతో పార్టీ నుంచి సస్పెండ్‌ అవ్వగా, మరో ముగ్గురు నాయకులు సోమవారం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌తో చర్చలు జరిపారు.



గతంలో టిఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న విజయరామారావుతో పాటు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్‌, సోయం బాబు రావులు దిగ్విజయ్‌ సింగ్‌తో మంతనాలు జరిపారు. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే టిఆర్‌ఎస్‌ పార్టీ కాలీ అవ్వడం కాయం అంటున్నాయి రాజకీయ వర్గాలు.