'తెలుగు' జాతితో కాంగ్రెస్ 'విభజన' ఆట..!

 

 

 

ఇంతకముందు తెలుగు వన్  'తెలంగాణ తూచ్' అనే ఆర్టికల్ లో చెప్పినట్లు తెలంగాణ బిల్లు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందడం కష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన రాజకీయాలు ఢిల్లీలో అనుకొనిమలుపులు తిరిగుతూ కేంద్రాన్ని దిక్కుతోచని స్థితిలో పడవేస్తున్నాయి. రాజ్యంగ౦లోని ఆర్టికల్ 110(1)అధికరణం ప్రకారం...సీమాంధ్రకు ఇచ్చే ఆర్ధిక కేటాయింపులు బిల్లులో ప్రతిపాదిస్తే దానిని ముందుగా లోక్ సభలో ప్రవేశ పెట్టాల్సి వుంటుంది. దీనిని రాజసభలో ప్రవేశపెట్టడం కుదరదు.


అయితే కేంద్రం వ్యూహాత్మకంగా బిల్లుని మొదట లోక్ సభలో బదులుగా రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు సిద్దమయింది. ఒకవైపు బిల్లుకి బీజేపీ మద్దతు కోరుతూనే, ఒకవేళ బిల్లుకి బీజేపీ మద్దతు ఈయకపోయినట్లయితే అదే బిల్లుతో బీజేపీని రాజకీయంగా దెబ్బ తీయవచ్చనే ఆలోచనతో సంప్రదాయానికి విరుద్దంగా విభజన బిల్లుని తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ వ్యూహం పన్నింది. అనేక ఆర్ధిక అంశాలతో కూడిన రాష్ట్ర విభజన బిల్లును లోక్ సభలో చర్చించి, ఆమోదించకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదని హమీద్ అన్సారీ తేల్చిచెప్పడంతో, కేంద్ర౦ ఇరకాటంలో పడింది. రాష్ట్రపతి నుంచి బిల్లు కేంద్రానికి అందాక కూడా ఏ సభలో బిల్లు పెట్టాలో తెలియనంత అయోమయంలో కాంగ్రెస్‌ పార్టీ వుందని అంటే, దాన్ని నమ్మగలమా?

ఇప్పటికే పార్లమెంటు సమావేశాల్లో ఐదు రోజులు వృధా అయిపోయాయి. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని హోంశాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరింది. రాష్ట్రపతి ఈ రోజే సమాధానమిస్తారో, రేపటికి నిర్ణయాన్ని వాయిదా వేస్తారో తెలీదు. ఫిబ్రవరి 21పార్లమెంట్ సమావేశాలకు ఆఖరిరోజు. లోక్‌సభ ఆమోదం పొంది, తమ ముందుకు వచ్చిన 14 రోజుల్లోపు రాజ్యసభ కూడా బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది.

రాష్ట్రపతి అనుమతిచ్చినా, రేపు లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి వుంటుంది.  ఫిబ్రవరి 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కాబట్టి వాటిపై రెండు, మూడు రోజులు చర్చకు సమయం కేటాయించక తప్పదు. అప్పటికి పార్లమెంట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకుంటాయి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుచూస్తే తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం కష్టమని కాంగ్రెస్ రాజకీయ నిపుణులు ఏనాడో స్పష్టం చేసిన.... కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ నీచ రాజకీయాలకోసం తెలంగాణ ప్రజల్లో ‘సీమాంధ్ర’ అంటే విద్వేషభావం ఇంకా పెరిగిపోయేలా చేసి తాను లాభపడలని చూస్తుందని రాజకీయ విశ్లేషకుల భావన.
 

పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అవడానికి బిజెపి మద్దతు కూడా అవసరమని కొత్త పల్లవి అ౦దుకున్న కాంగ్రెస్ పార్టీ... బిజెపి, టిడిపి తెలంగాణా ద్రోహులుగా చిత్రీకరించి లాభపడాలని చూస్తోంది. సీమాంధ్ర ప్రాంతానికి కూడా పూర్తిగా అన్యాయం చేస్తున్నామనే భావన అక్కడి ప్రజల్లో కల్పిస్తే.... త్వరలో కాంగ్రెస్ లో కలిసిపోయే జగన్ మోహన్ రెడ్డి పక్కన చేరుతారు కాబట్టి....చివరికి ఇరుప్రాంతాల్లో లాభపడేది తామేనని కాంగ్రెస్ అదిష్టానం భావిస్తోందని సమాచారం.    అయితే ఇక్కడిదాకా వచ్చాక తెలంగాణ అంశం ఆగిపోతే...ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరుప్రాంతా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టాడం ఖాయమని ఇరుప్రాంత రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు!