తెలంగాణ కోసం భారీ ప్యాకేజి

.....సాయి లక్ష్మీ మద్దాల

 

congress telangana, telangana issue, separate telangana congress

 

 

తెలంగాణ పై ఇహ నాన్చుడు ధోరణి కాకుండా,ఏదో ఒకటి నిర్ణయించే దిశలో రాహుల్ గాంధి పట్టుదలగా ఉన్నట్లు యుపిఎలోని అత్యున్నత స్థాయి వర్గాల సమాచారం. ఇప్పుడున్న పరిస్థుతులలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని మిగతా రాష్ట్రాలలో తలెత్తే సమస్యలకు తావివ్వకుండా, కోర్ కమిటీ ప్యాకేజి నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈప్యాకేజి ముఖ్యాంశాలలో ఒకటి తెలంగాణ ప్రాంత ఉద్యోగావకాశాలు,రాజకీయ అధికారం పంపిణిలోను తెలంగాణ వాటా నిర్ణయం. ఈ ప్యాకేజిని ఈ నెల 28 లోగా ప్రకటిస్తారని ప్రభుత్వంలోని అతున్నత స్థాయి వర్గాల సమాచారం. ఈ ప్యాకేజితో అందరు తెలంగాణ వాదులను సంత్రుప్తి పరచగలమని వారి ఆశ.


 ఉద్యమానికి వివధ కొత్త కోణాలతో రాజకీయ రంగు పులిమి తద్వారా తానేదో బావుకుందామని ఆలోచిస్తున్న కే.సి. ఆర్ కు ఇది మింగుడు పడే  అంశమేనా? రాబోయే కాలంలో కేంద్రంలో చక్రం తిప్పబోయేది ఫెడరల్ ఫ్రంట్ ద్వారా తామేనని కొత్తగా మరో ప్రకటన చేశారు గనుక. తెలంగాణ లో  అభివృద్ధి  లేని కారణంగా ప్యాకేజిని ఇచ్చి తద్వారా అభివృద్ధిని సాధించి పెట్టవచ్చు అనేదే రాహుల్  ఆలోచన అయితే,మరి ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ది కి నోచుకోని ప్రాంతాలు,నాగరికతకు ఆమడ దూరంలో ఉన్న ప్రాంతాలు అటు ఉత్తరాంధ్రలోను,ఇటు రాయలసీమలోనూ ఉన్నాయి మరి ఆప్రాంతాలకు ఎటువంటి న్యాయం చేస్తారో,వివరించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అన్ని ప్రాంతాలలోను సమానంగా జరిగినపుడే ప్రాంతీయ అసమానతలు తోలగుతాయనేది రాజ్యంగ ధర్మం. కాని నేడు ఆధర్మాన్ని వారి వారి రాజకీయాల లబ్ధి కోసం తుంగలో తొక్కుతున్నారు.