అసెంబ్లీ లో కాంగ్రెస్, టిడిపిలకు ఝలక్

 

 

congress tdp, ysr congress tdp, jagan mlas congress

 

 

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కాంగ్రెస్, తెలుగుదేశం లను నుంచి ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలు అధికారికంగా గీత దాటారు. కాంగ్రెస్ నుంచి అవిశ్వాసానికి అనుకూలంగా మద్దాల రాజేష్, పేర్నినాని, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి , బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవి, అమరనాథ్ రెడ్డి, సాయిరాజ్, జోగి రమేశ్, సుజయ్ రంగారావు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆళ్లనానిలు ఓటు వేశారు. వీరంతా కాంగ్రెస్ నుంచి వైఎస్ ఆఆర్ సీపీ వైపు వెళ్లిన వారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా తమ పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించారు.

 

ఇక తెలుగుదేశం  నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించారు. రెబెల్ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, రామకోటయ్య, వేణుగోపాల చారి ఓటింగ్ దూరంగా ఉన్నారు. కొడాలి నాని, వనితలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా నిలిచారు. మరి వీరిపై ఆయా పార్టీలు చర్యలు తీసుకుంటాయా?