కాంగ్రెస్‌కు తేల్చే స‌త్తా ఉందా..?

 

తెలంగాణ విష‌యంపై గత వారం రోజులుగా చ‌ర్చలు జ‌రుపుతున్న కాంగ్రెస్ చివ‌ర‌కు మ‌రోసారి రాష్ట్రనాయ‌క‌త్వాన్ని ఉసూరు మ‌నిపించింది. అంతా అయిపోయింది ఇక నిర్ణయ‌మే మిగిలింది అన్న నేత‌లు ఆ నిర్ణయాన్నే ఎప్పుడు చెపుతారు అన్న విష‌యం మాత్రం తేల్చటం లేదు.  అస‌లు నిజంగా కాంగ్రెస్‌కు తెలంగాణ పై తేల్చే స‌త్తా ఉందా అన్న విష‌యం కూడా ఇప్పుడు అనుమానం క‌లుగుతుంది..

మిగ‌తా అన్ని పార్టీల అభిప్రాయాలు తాము చెప్పిన డేట్ లోపు చెప్పాల‌న్న కాంగ్రెస్ అధిష్టానం.. త‌మ పార్టీ అభిప్రాయం చెప్పడానికి మాత్రం మీన‌ మేషాలు లెక్కపెడుతుంది.. ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియ పూర్తి అయింద‌ని ప్రక‌టించిన కోర్‌క‌మిటీ, నిర్ణయాన్ని మాత్రం ఎందుకు వాయిదా వేసింది అన్న విష‌యం ఎవ‌రికీ అర్ధం కావ‌టం లేదు.

అస‌లు స‌మ‌స్య అంతా హైద‌రాబాదే అంటున్న అదిష్టానంకు ఆ స‌మ‌స్యను ప‌రిష్కరించే స‌త్తా ఉందా..? స‌మ‌స్యను ప‌రరిష్కరించే దిశ‌గా కాంగ్రెస్ చేస్తున్న ప్రయ‌త్నాలు ఏంటి..? అధిష్టానం నిర్ణయం వ్యతిరేకంగా తీసుకున్న ప‌క్షంలో పార్టీకి, ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తామ‌న్న కాంగ్రెస్ నేత‌ల తీరుపై అధినాయ‌కత్వం స్పందిచ‌క‌పోవ‌డం వెనుక మ‌త‌ల‌బేంటి..? ఇలా ఎన్నో ప్రశ్నలు.. వేధిస్తున్నాయి.. దీంతో అస‌లు కాంగ్రెస్‌కు ఈ స‌మ‌స్యను తేల్చే ఆలోచ‌న ఉందా లేదా అన్న అనుమానం కూడా క‌లుగుతుందంటున్నారు విశ్లేష‌కులు..

గ‌త‌ంలో ఒక‌సారి ఇలాగే అర్ధ రాత్రి ప్రక‌ట‌న చేసిన కాంగ్రెస్కు మ‌రోసారి అలాంటి ప‌రిస్థితులు ఎదురైతే ఎదుర్కొనే స‌త్తా ఉందా అన్నది కూడా అనుమాన‌మే.. ఇలాంటి ఎన్నో విష‌యాల‌ను బేరిజు వేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పై తేల్చడం క‌న్నా నాన్చడ‌మే బెట‌ర్ అన్న ఆలోచ‌న‌లో ఉంద‌న్న వాద‌న కూడా వినిపిస్తుంది..