ఒకరు వైసీపీ..మరొకరు జనసేన

 

కాంగ్రెస్,టీడీపీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు దోస్తీ కట్టిన సంగతి తెలిసిందే.అయితే టీడీపీ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెటుకోవటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య పార్టీకి రాజీనామా చేశారు.అంతేకాకుండా వైసీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.ఈ నెల 13న బొబ్బిలిలో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు సి.రామచంద్రయ్య.తొలుత టీడీపీ పార్టీలో పలు పదవులు చేపట్టిన రామచంద్రయ్య..ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు.అనంతరం ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ పదవి దక్కింది.అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రామచంద్రయ్య కాంగ్రెస్,టీడీపీ పొత్తును నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేశారు.వైసీపీ లో చేరనున్నారు. జిల్లాకు చెందిన రామచంద్రయ్య  పార్టీలో చేరితే పలు విభాగాల్లో ఆయన సేవలు వినియోగించుకోవచ్చు అనే యోచనలో ఉంది వైసీపీ.అంతేకాకుండా పార్టీ అభివృద్ధికి ఎంతో తోడ్పడే అవకాశం ఉందని వైసీపీ భావిస్తుంది.

 

 

మరోవైపు దాదాపు 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన పనుపులేటి బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు.జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆ పార్టీలో ఆయన చేరనున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా.. ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీని వీడుతున్నట్టు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న బాలరాజు 1987లో ఉద్యోగానికి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. జీకే వీధి మండల పరిషత్‌ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బాలరాజు.. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్‌ఆర్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు.