సోనియాకి అసలేం జరిగింది?

 

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గురువారం నాడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు. సోనియా గాంధీ శ్వాసకోశానికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారని, ఊపిరితిత్తుల మార్గంలో ఇన్‌ఫెక్షన్ చేరడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను ఆస్పత్రిలో చేర్చారని తెలుస్తోంది. అయితే సోనియా గాంధీ అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరడం పట్ల కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏదో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య అయితే ఇంత అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం ఏంటని ధర్మ సందేహం వ్యక్తం చేస్తున్నారు. సోనియా అంతకు మించిన ఆరోగ్య సమస్య ఏదో ఏదుర్కొన్నారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోనియాగాంధీ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ వ్యాధికి చికిత్స కోసం ఆమె అమెరికా దేశానికి వెళ్ళి చికిత్స చేయించుకున్నారు. అయితే ఆమెకు క్యాన్సర్ పూర్తిగా తగ్గిందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పుడు సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరడానికి కారణం కారణం క్యాన్సర్ తిరగబెట్టడమే కావచ్చన్న భయాందోళనలను కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సోనియా గాంధీని ‘అమ్మ’లా భావిస్తూ, ‘అమ్మా’ అని అప్యాయంగా పిలిచేవాళ్ళయితే తమ కన్నతల్లి ఆస్పత్రిలో చేరినట్టుగా తల్లడిల్లిపోతున్నారు. అయ్యో పాపం..