కాంగ్రెస్ 'కమ్మ'నైన వ్యూహం

 

congress kavuri samba siva rao, congress 2014 elections, congress Daggubati Purandeswari

 

 

కాంగ్రెస్ పార్టీ 'కమ్మ' సామాజికవర్గాన్ని టార్గెట్ చేసిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్ని రోజులూ రెడ్డి ఆదిపత్యపు పార్టీగా నిలిచిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు కాపులతో పాటు కమ్మలకు కూడా ప్రాధాన్యం ఇచ్చి వారిని తమవైపు తిప్పుకోవాలని చూస్తోందని అంటున్నారు. అందుకే కమ్మ ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు ఇస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 

తాజాగా కావూరి సాంబశివరావుకు కేంద్ర క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కడంతో ఈ విశ్లేషణలకు బలం చేకూరుతోంది. కాంగ్రెస్ కమ్మలను ఆకట్టుకోవడానికే ప్రయత్నిస్తోందని అర్థం అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ తరపున కావూరి, రాయపాటి, లగడపాటి, పురందేశ్వరి ఎంపీలుగా ఉన్నారు! నలుగురిలో ఇద్దరు కేంద్ర క్యాబినెట్ లో మంత్రులు! ఇంకా రేణుకాచౌదరి అధిష్టానం స్థాయిలో చక్రం తిప్పుతున్నారు!  మరి కాంగ్రెస్ లో ఇప్పుడు వారికి మంచి ఆదిపత్యమే దక్కుతోంది.

 

మరి ఈ పరిణామాలతో కమ్మ సామాజికవర్గాన్ని కాంగ్రెస్ ఆకర్షించగల్గుతుందా? తిరిగి అధికారం చేజిక్కించుకుంటుందా?