కాంగ్రెస్ కోర్ కమిటీ భేటి...'టి' బిల్లు లోక్‌సభలోనా!

 

 

 

ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో మంగళవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. సుమారు 30 నిముషాలపాటు ఈ భేటీ జరిగింది. కేంద్రమంత్రులు సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, ఏకే ఆంటోనీతో పాటు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ తదితరులు హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో తెలంగాణ బిల్లును లోక్‌సభలోనా, లేక రాజ్యసభలో ప్రవేశపెట్టాలా, ఎప్పుడు ప్రవేశ పెట్టాలి అన్నదానిపై ప్రధానంగా చర్చ జరిగింది.


ఈ కోర్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను ఆమె నివాసం వద్ద కలిశారు. దీని బట్టి చూస్తుంటే తెలంగాణ అంశంపై కాంగ్రెస్ ఎంత గట్టి పట్టుదలతో ఉందో తెలుస్తుంది. బుధవారం లోక్ సభలో రైల్వే బడ్జెట్ కాబట్టి గురువారం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్షాలను కూడా కేంద్రం ఒప్పించే ప్రయత్నంలో ఉంది.