వై కాంగ్రెస్? సందిగ్దంలో రెడ్డిగారు

 

 

తల్లి పిల్లా కాంగ్రేసులు ఏనాటికయినా ఒకటయ్యేవే అని ఒకవైపు చంద్రబాబు ఎంతగా మోత్తుకొంటున్నా అర్ధంచేసుకోలేని కొందరు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్... వై... కాంగ్రెస్ అంటూ ఎటువైపు జంపింగ్ తీసుకోవాలో తెలియని సందిగ్దంలో ఒకసారిటు, ఒకసారటు దిక్కులు చూస్తున్నారు గోడ మీద పిల్లిలా.



కాంగ్రెస్ ఉప్పు తింటూ వై.యస్సార్ కాంగ్రేసుకి జై కొట్టిన అనేకమందిలో ఒకడయిన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ శాసనసభ్యుడు శివప్రసాదరెడ్డి, జగన్ పార్టీ పెట్టగానే వై (?) కాంగ్రెస్ అంటూ అటువైపు పరుగులు తీసాడు. గానీ, ఆ తరువాత జగన్ జైల్లోకి వెళ్ళే పరిస్థితులు కనిపించడంతో మళ్ళీ బుద్దిగా ‘వై నాట్ కాంగ్రెస్?’ అనుకొంటూ కాంగ్రెస్ బెంచీల మీదకోచ్చేసాడు.



గానీ మనసొకచోట మనువు మరోచోటా అన్నట్లున్న అతను, మద్య మద్యలో ఆ ‘వై.కాంగ్రెస్’ వైపు పక్కచూపులు చూస్తూనే ఉన్నాడు. గానీ, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద జగన్ కత్తికట్టి అవిశ్వాసం పెట్టినప్పుడు మరేమనుకున్నడో ఏమో శివప్రసాదరెడ్డి మళ్ళీ ‘వై నాట్ కాంగ్రెస్?’ అంటూ ప్రభుత్వానికే తన మద్దతు తెలిపాడు.



కొద్ది నెలలక్రితం జరిగిన ఉపఎన్నికలలో తన ‘వై కాంగ్రెస్’ భారీ విజయం సాదించడంతో ఏ కాంగ్రేసు ను నమ్ముకుంటే మంచిదో అర్ధంకాక మళ్ళీ మరోసారి సందిగ్దంలో పడ్డారు మన రెడ్డిగారు. అందుకే ఎందుకయినా మంచిదని కొంచెం రెండు కాంగ్రేసులతో రాసుకు పూసుకు తిరుగడమే మంచిదనే నిర్ణయానికి వచ్చి, మొన్న జగన్ పార్టీ వాళ్ళు జగన్ అరెస్ట్ కు వ్యతిరేకంగా మొదలుపెట్టిన కోటి సంతకాల సేకరణలో తానూకూడ సంతకం పెట్టి “మా జగన్ బాబుకి జై!” అని ఓ కేకేసి మళ్ళీ తన ఒరిజినల్ కాంగ్రెస్ శిబిరానికి తిరిగి వచ్చేసాడు.