సింగ్ సాబ్‌ని ఎందుకు ప్రశ్నించలేదు?

 

దేశ రాజకీయాలను ఒక్క కుదుపు కుదపడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ఒక కారణంగా నిలిచిన బొగ్గు కుంభకోణం మీద ప్రత్యేక కోర్టులో మంగళవారం నాడు విచారణ ప్రారంభమైంది. ఈ కుంభకోణానికి సంబంధించి అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తోపాటు బొగ్గు మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన వారిని ఎందుకు విచారించలేదని ప్రత్యేక కోర్టు సీబీఐని ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. అయితే బొగ్గు శాఖ మంత్రిని ప్రశ్నించడానికి తాము పీఎంఓని సంప్రదించామని, తమకు అనుమతి రాకపోవడం వల్ల ఊరుకున్నామని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన కోర్టు విచారణ డైరీని తనకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.