'అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి' అన్న స్థితిలో ఆదినారాయణ

జమ్మలమడుగు సోదరుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి రెండు వేల పద్నాలుగులో వైసీపీ టికెట్ పై గెలిచి పచ్చ కండువా కప్పుకుని మంత్రి అయ్యారు. ఈయన ప్రస్తుతం పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కానీ బీజేపీలో ఈయన చేరికకు బ్రేక్ పడింది. అప్పటి నుంచి ఈయన పొలిటికల్ స్క్రీన్ పై అంతగా కనిపించడం లేదు. అప్పట్లో  టీడీపీలోకి ఆది ప్రవేశాన్ని అడ్డుకున్న సీఎం రమేష్ ఇపుడు బీజేపీలో ఎంట్రీ కూడా అడ్డుపుల్ల వేశారని జమ్మలమడుగు బ్యాచ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీ మారిన సీఎం రమేష్ అదే పార్టీలోకి వెళ్లాలనుకుంట్టున్న ఆదినారాయణ రెడ్డి మధ్య పాత వైరాలు మళ్లీ పురివిప్పాయి. బీజేపీలోకీ తొలుత ఎంట్రీ ఇచ్చిన సీఎం రమేష్ ఆది ఎంట్రీకి బ్రేక్ వేస్తున్నారా అనే అనుమానాలు వెల్లడవుతున్నాయి.ఢిల్లీలో అన్ని పార్టీల నేతలతో సంబంధాలున్న రమేష్ కడపలో తన ఆధిపత్యానికి గండి కొట్టిన ఆదిని కమలం గూటికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారా.

బీజేపీలో ఆదీ ప్రవేశం ఖాయమైందని అమిత్ షా లేదా నడ్డా సమక్షంలో కండువా కప్పుకోటం ఖాయరుని జోరుగా ప్రచారం జరిగింది. ఆదీ కూడా అభివృద్ది కోసం బీజేపీలో చేరుతున్నట్టుగా అధికారికంగా ప్రకటించి ఢిల్లీ ఫ్లైటెక్కాడు. అయితే అక్కడ సీన్ రివర్సైంది. పార్టీలోకి ఎంట్రీ కాదు గదా అపాయింట్ మెంట్ కూడా దక్కలేదు. ఇటు ఉన్న పార్టీని వదులుకొని అటు కమలదళం గూటికి చేరుకోలేక రెంటికీ చెడ్డ రేవడిగా మారిన ఆది సీఎం రమేష్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని ప్రోత్సహిస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా సీఎం రమేష్ అడ్డుపుల్ల వేయడంతో తనకు టికెట్ రాలేదని క్లారిటీతో ఉన్న వరద సీఎం రమేష్ పై బురద చల్లుతున్నారు. నిన్నటికి నిన్న తన స్వగ్రామం పొట్లదుర్తి నుంచి గాంధీ సంకల్ప యాత్ర చేపట్టిన సీఎం రమేష్ పై వరద విరుచుకుపడటం వెనక ఆది హస్తం ఉందన్న  ప్రచారం జరుగుతోంది. తను కమలం కండువా కప్పుకోగానే నీక్కూడా కండువ కప్పిస్తానని వరదకు ఆది హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ప్లాన్ మొత్తం తేడా కావటంతో సీఎం రమేష్ ను పలుచన చేయటమే వీరి టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.