కేశవరావు తో సీఎం కేసీఆర్ ఆర్టీసీ పై చర్చలకు సిద్ధంగా ఉన్నారా?

 

నేడు టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పార్లమెంటరీ పార్టీనేత కే కేశవరావు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి మరి కేసీఆర్తో సమావేశమయ్యారు కేకే. తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతున్న ఆర్టీసీ సమ్మెపై ఇద్దరు చర్చించనట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఆర్ఎస్ నేతల్లో కేకే ఒక్కరే మద్దతుగా మాట్లాడారు. ప్రభుత్వం కార్మికుల మధ్య చర్చలు జరగాలన్నారు. చర్చలకు మధ్యవర్తిగా ఉంటానని ఆయన ప్రకటించారు.

కేసీఆర్, కేకే మీటింగ్ లో హోమ్ మంత్రి మహమూద్ అలీ కూడా పాల్గొన్నారు. సీఎం చాంబరులో కేశవరావుతో పాటు హోం మంత్రి మహమద్ అలీ సమావేశమయ్యారు.  ఉదయం సీఎం ఆఫీసు నుంచి కేకే కు పిలుపు రావడంతో కేకే ప్రగతి భవన్ కు వెళ్లారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ తరపున టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలు చాలా మంది సీనియర్లు మంత్రుల ఎంతమంది ఉన్నప్పటికీ చర్చలు జరగాలి చర్చకు మధ్యవర్తిగా వహిస్తానని ముందుకొచ్చింది మాత్రం కేశవరావు ఒక్కరే.

కాని కేశవరావు ముందుకొచ్చిన తర్వాత కార్మికుల నుంచి మంచి ఫలితం వచ్చింది. కార్మికులు కేశవరావు మధ్యవర్తిగా ఉంటే మాకేం అభ్యంతరం లేదు చర్చకు మేం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.కానీ ప్రభుత్వం నుంచి కేశరావుకి ఎలాంటి సంకేతాలు రాలేదు. ఆయన సీఎంను కలిసేందుకు సీఎంతో మాట్లాడేందుకు ప్రయత్నం చేసినట్టుగా కూడా కేశవరావునే స్వయంగా చెప్పారు. కానీ సీఎం అందుబాటులోకి రాలేదు కాబట్టి ఆ చర్చలు జరగలేదు. మంచి జరుగుతుందంటే తను ఇప్పుడు కూడా చర్చ జరిపేందుకు మధ్యవర్తి వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేశవరావు వెల్లడించారు.ఇక చర్చలు జరిగి సమ్మేకు ఒక పరిష్కారం వస్తోందో లేదో వేచి చూడాలి.