కేసీఆర్‌ విమర్శలు..రాష్ట్రంలో ఐటీ దాడులు..సీఎం అత్యవసర భేటీ

ఒక పక్క తెలంగాణాలో కేసీఆర్‌ మరో పక్క రాష్టంలో ఐటీ అధికారుల దాడులు ఈ నేపధ్యం లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గ సమావేశానికి ముందే కొందరు మంత్రులతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.మంత్రివర్గ సమావేశంలో రాష్టం లో జరుగుతున్నఐటీ దాడులపై చర్చ జరిగినట్టు సమాచారం.చంద్రబాబు నేతలకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించి టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తోందని,నేతలంతా ధైర్యంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.సమావేశంలో కేసీఆర్ విమర్శలు కూడా చర్చకొచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.

 

 

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ దాడులపై తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్,ఏపీ మంత్రి ఆదినారాయణ,కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు.అమరావతిలో మీడియా తో మాట్లాలిన కనకమేడల ఐటీ సోదాల పేరుతో కేంద్రం మైండ్‌ గేమ్‌ ఆడుతోందన్నారు. అధికార దుర్వినియోగంలో మోదీ ప్రభుత్వం ముందజలో ఉందని విమర్శించారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం ప్రభుత్వం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలు, రాష్ట్రంపై కేంద్రం చూపిస్తున్న వివక్ష పట్ల నిలదీస్తున్నందునే ఈ దాడులు జరుగుతున్నాయని కనకమేడల ఆరోపించారు.కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో పథకం ప్రకారమే ఐటీ దాడులు జరుగుతున్నాయని,రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఐటీ దాడులు చేపట్టారని మండిపడ్డారు. కేసీఆర్‌కు నోటి దురుసు ఎక్కువని, సీఎం హోదాలో ఉండి వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పడిపోతుందని..కూటమిదే గెలుపని తులసిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఏపీ మంత్రి ఆదినారాయణ ఓటమి భయంతోనే కేసీఆర్ చంద్రబాబుని టార్గెట్ చేశారని,కేసీఆర్‌కి నోటి దురద ఎక్కువై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.రాజకీయ కోణంలోనే ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా ఐటీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే విషయం తెలుసుకోవాలని మంత్రి సూచించారు.